- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాపారస్థులకు రిలీఫ్.. లావాదేవీలు షురూ !
దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ అమలు చేస్తూనే ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా షాపులకు అనుమతించడంతో లావాదేవీల ప్రారంభమయ్యాయి. మొబైల్ షాపులు, సెలూన్‌లు, బట్టల దుకాణాలు, హోల్‌సేల్ షాప్‌లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు విక్రయించే వ్యాపార సంస్థల్లో కొనుగోళ్లు షురూ అయ్యాయి. దాదాపు 2నెలల తర్వాత లావాదేవీలకు అవకాశం రావడంతో దుకాణాదారులు ఓ వైపు సంతోషం వ్యక్తం చేస్తూనే.. భవిష్యత్తులో వ్యాపారం ఎలా ఉంటుందోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మంగళవారం సెలూన్ షాప్‌లు లేబర్ హాలిడేగా భావించి బంద్ చేస్తారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా తెరుచుకోనందున మంగళవారం సెలూన్లను తెరిచారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరిస్తున్నారు. కానీ, 2 మీటర్ల భౌతిక దూరం పాటించడం లేదు. అందుకు దుకాణాలు పెద్దగా లేకపోవడమే కారణం.
విధులకు వెళ్లేందుకు బైక్‌ల రిపేర్
లాక్‌డౌన్ సడలింపులపై కేసీఆర్ ప్రకటన చేయడంతో మంగళవారం రహదారులన్నీ సాధారణ రోజులను తలపించాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న దుకాణాలు తెరుచుకున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యాలయాల్లో 33శాతం సిబ్బందికి మాత్రమే అనుమతి ఉండేది. సడలింపులతో సిబ్బంది మొత్తం డ్యూటీలకు వెళ్తున్నారు. ప్రైవేటు సంస్థలు, ఇతర కార్యాలయాల సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోం నుంచి తమ కార్యాలయాలకు పయనమవుతున్నారు. ప్రస్తుతం సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌లకు అనుమతి లేనందున.. సొంత వాహనాలను రోడ్లపైకి తెచ్చేందుకు సిద్దం అవుతున్నారు. దీంతో వాహనాలను రిపేర్ చేసుకోవడానికి బైక్ పాయింట్ సెంటర్లకు క్యూ కడుతున్నారు.