సెలబ్రిటీల్లో మ్యాటర్ లేకపోయినా ఈగోకు తక్కువేం లేదు!

by Shyam |   ( Updated:2024-06-02 15:23:07.0  )
Call My Agent
X

దిశ, సినిమా : నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ‘కాల్ మై ఏజెంట్: బాలీవుడ్’ ఆడియన్స్‌కు అన్ని రకాల ఎమోషన్స్ పంచేందుకు సిద్ధం అవుతోంది. అక్టోబర్ 29న ప్రీమియర్ కానున్న సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. స్టార్ మేకర్స్, క్రియేటివ్ మ్యారేజెస్ క్రియేటర్స్, ఏజెంట్స్ రూపంలో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తోంది. మూసివేతకు సిద్ధంగా ఉన్న ప్రముఖ టాలెంట్ ఏజెన్సీ ‘ఆర్ట్’ను ఈ ప్రమాదం నుంచి కాపాడేందుకు టాలెంట్ మేనేజర్స్.. అహనా కుమ్రా, ఆయుష్ మెహ్రా, సోని రజ్దాన్, రజత్ కపూర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొ్న్నారు? నటీనటులను ఎలా కంట్రోల్ చేయగలిగారు? అనేది కథ.

కాగా ఫరా ఖాన్, అలీ ఫజల్, రిచా చద్దా, లారా దత్తా, జాకీ ష్రాఫ్, దియా మీర్జా, అక్షర హాసన్ ప్రధానపాత్రల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్, కాస్టింగ్ కౌప్స్, సెలబ్రిటీ ఈగోస్, టాలెంట్ మేనేజర్స్ యాక్టర్స్‌ను సెలెక్ట్ చేసే విధానంపై సెటైరికల్‌గా వస్తున్న ఈ సిరీస్‌ను అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్, బనిజయ్ ఆసియా సంయుక్తంగా నిర్మిస్తుండగా షాద్ అలీ దర్శకత్వం వహించారు.

Advertisement

Next Story