టెలికాం కంపెనీలపై రూ. 35 కోట్ల జరిమానా

by Harish |
టెలికాం కంపెనీలపై రూ. 35 కోట్ల జరిమానా
X

దిశ్, వెబ్‌డెస్క్: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) టెలికాం కంపెనీలపై జరిమానాలను విధించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సహా టెల్కోలు నకిలీ మేసేజ్‌లకు అనుమతించిన కారణంగా రూ. 35 కోట్ల జరిమానాను విధించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్‌కు అత్యధికంగా రూ. 30.1 కోట్ల జరిమానా విధించగా, అయితే, ఇదివరకు ట్రాయ్ షోకాజ్ నోటీసులను ఇచ్చినప్పటికీ బీఎస్ఎన్ఎల్ స్పందించకపోవడంతో జరిమానా అధికంగా ఉంది.

వొడాఫోన్ ఐడియా రూ. 1.82 కోట్ల, ఎయిర్‌టెల్‌పై రూ. 1.33 కోట్ల జరిమానాను విధించింది. పేటీఎం నేతృత్వంలోని ఈ-పేమెంట్ సంస్థలు చేస్తున్న నకిలీ మెసేజ్‌లకు స్పందిస్తూ టెల్కోలపై జరిమానా విధించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ట్రాయ్ తెలిపింది. ఈ కేసుపై సెప్టెంబర్‌లో విచారణ జరిగిన సమయంలో నకిలీ వాణిజ్య సమాచార ప్రసారాలను అరికట్టేందుకు కంపెనీలు, వాటి నిబంధనలను పాటించని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ట్రాయ్‌ను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed