- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఇండస్ట్రీలో విషాదం.. 'అపరిచితుడు' కీలక నటుడు మృతి.. కారణం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకొంది. సోమవారం ఉదయమే కన్నడ నటుడు సత్యజిత్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకొనేలోపే మరో జాతీయ అవార్డు నటుడు మృతిచెందాడు. ప్రముఖ మలయాళ నటులు, నేషనల్ అవార్డు విన్నర్ నెడుముడి వేణు సోమవారం మరణించారు. గతకొన్ని రోజులుగా కడుపు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది గంటల క్రితం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నెడుముడి వేణు మరణ వార్త విన్న మలయాళ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురి అయ్యింది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
నెడుముడి వేణు అసలు పేరు కేశవన్ వేణుగోపాల్. తమిళ్, మలయాళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగు డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడే. ‘భారతీయుడు’ చిత్రంలో సీనియర్ కమల్ హాసన్ ని పట్టుకోవడానికి ప్రయత్నించే డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటన చిరస్మరణీయం. ఇక ‘అపరిచితుడు’ చిత్రంలో విక్రమ్ తండ్రిగా, లాయర్ గా నటించి మెప్పించారు. నెడుమూడి వేణు నటనకు గాను మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నారు.