రాష్ట్రపతి పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు.. యూపీ మహిళ మృతి

by Sumithra |
UP Police
X

లక్నో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవలి ఉత్తరప్రదేశ్ పర్యటనలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్‌లో ఆయన వెళ్తుండగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఫలితంగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో 50ఏళ్ల వందన మిశ్రా శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం హెడ్ వందన మిశ్రా ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. కానీ, మళ్లీ అనారోగ్యంపాలవడంతో ఆమె కుటుంబీకులు హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి బయల్దేరారు. రాష్ట్రపతి ప్రయాణించే దారి గుండానే వారూ బయల్దేరడంతో ట్రాఫిక్ అంతరాయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ కూడా విషయం తెలియగానే సదరు కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed