హైదరాబాద్‌లో 2నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

by Anukaran |   ( Updated:2020-11-10 11:31:38.0  )
హైదరాబాద్‌లో 2నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్‌నగర్ యాదగిరి థియేటర్ వరకు స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్న నేపథ్యంలో 2నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నవంబరు 11నుంచి 2021 ఫిబ్రవరి 11వరకూ ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలలో మళ్ళించనున్నట్టు వివరించారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం ధోబిఘాట్ జంక్షన్, ఐఎస్‌సదన్ జంక్షన్, చంచల్‌గూడ జంక్షన్, సైదాబాద్ క్రాస్‌రోడ్స్ వద్ద స్తంభాలు వేసే పనులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల మధ్య దూరం 3.38కి.మీ ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, నల్లగొండ ఎక్స్‌రోడ్ నుంచి ఐఎస్‌సదన్ వెళ్లేవారు, ఐఎస్‌సదన్ నుంచి నల్లగొండ ఎక్స్‌రోడ్ వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Advertisement

Next Story