- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘మరింత కఠినంగా రోజూ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు’
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో మరింత కఠినంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయనున్నామని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అంతేగాకుండా ఇక నుంచి రోజూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే కఠినంగా తనిఖీలు చేస్తామని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పబ్‌లు, బార్‌లు నడిపిస్తే.. కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఒకవేళ నిర్వహిస్తే.. పబ్ నిర్వాహకులే కస్టమర్లకు డ్రైవర్‌లను ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. మొదటిసారి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష అన్నారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు.