విదేశీ ఈ-కామర్స్‌పై కఠిన నిబంధనలు అమలు చేయాలి : వాణిజ్య సంఘాలు

by Harish |
విదేశీ ఈ-కామర్స్‌పై కఠిన నిబంధనలు అమలు చేయాలి : వాణిజ్య సంఘాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని రిటైలర్లతో కూడిన వాణిజ్య సంఘాలు విదేశీ ఈ-కామర్స్ కంపెనీలపై మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు భారీగా విక్రేటలను చూపుతూ స్థానిక చట్టాలను దుర్వినియోగానికి పాల్పడుతున్న కంపెనీలపై సమగ్రమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. మొత్తం అమ్మకాల్లో ఐదారు మంది విక్రేతల ఆదాయమే 95 శాతం వరకు ఉందని వారు ఆరోపణలు చేశారు. వినియోగదారుల ప్రవర్తనను తెలుసుకునేందుకు ఈ ఈ-కామర్స్ రిటైలర్లు చిన్న అమ్మకందారుల డేటాను, అమ్మకాల తీరుకు సంబంధించిన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.

అలాగే, ప్రైవేట్ లేబుల్స్ ప్రవేశపెట్టిన లబ్ది పొందుతున్నట్టు స్పష్టం చేశాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్(ఏఐసీపీడీ), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్(ఎఫ్ఏఐడీఏ), ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రేడర్స్ అసోసిఏషన్ ఈ అంశంపై సమావేశం నిర్వహించి విదేశీ ఈ-కామర్స్ కంపెనీలపై కఠిన నిబంధనలను అమలు చేయాలని తీర్మానించాయి.

Advertisement

Next Story

Most Viewed