- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ,చౌటుప్పల్: కరోనా మహమ్మారి సమయంలో హైపొక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసిన ట్రాక్టర్ యజమానికి బిల్లులు చెల్లించకపోవడంతో శనివారం మున్సిపల్ కార్యాలయం ముందు తన వాహనంతో ధర్నాకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ట్రాక్టర్‌ను నిలిపి ఎవరు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీకి కరోనా మహమ్మారి సమయంలో తోకల గోపాల్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయుటకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. సుమారు ఐదు నెలల పాటు ఈ ద్రావణాన్ని పిచికారి చేసినందుకు రెండు లక్షల 80 వేల రూపాయలు బిల్లు అయినది. ఇందుకుగాను లక్షా 90 వేల రూపాయలను చెల్లించి మిగతా 90 వేల రూపాయలు ఇప్పటివరకు చెల్లించడం లేదని గోపాల్ తెలిపారు. మిగతా 90 వేల రూపాయలు చెల్లించాలంటూ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరు స్పందించడం లేదని, గతంలో పనిచేసిన కమిషనర్ రామ దుర్గా రెడ్డి, శానిటరీ ఇన్ స్పెక్టర్ వేణు ఇద్దరూ కలిసి తన డబ్బులు డ్రా చేసుకొని వాడుకున్నారని ఆరోపిస్తున్నాడు. దీనిపై వెంటనే కలెక్టర్ స్పందించి తన సమస్యను పరిష్కరించాలని ఆయన వేడుకుంటున్నాడు. ఈ ధర్నా కార్యక్రమంలో బొప్పిడి రామ్ రెడ్డి, లింగస్వామి, పూలమ్మ,బాలమ్మ,లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- dharna