- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీవీ చివరి శ్వాసవరకు కాంగ్రెస్ వాదే : ఉత్తమ్
దిశ, వెబ్‌డెస్క్ :
పీవీ నరహింహరావు జయంతి వారోత్సవాలను పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ దివంగత ప్రధాని పీవీ నరసింహారావు వంగరలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి ప్రధాని స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉందని, దేశంలో భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీకే దక్కిందన్నారు. పీవీ పుట్టుక నుంచి.. చనిపోయే వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తుచేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని ఆదుకున్నది పీవీ సంస్కరణలేనన్నారు. పీవీ నరసింహరావు తమకు గర్వకారణమని చెప్పుకొచ్చారు. పీవీ పేరుమీద ఎవరు ఎలాంటి వేడుకలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. 2023లో పీవీ స్ఫూర్తితో పనిచేసి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా తాము పనిచేస్తామని ఎంపీ ప్రకటించారు.