- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘టీఆర్ఎస్ పతనమవుతోంది.. అధికారంలోకి వచ్చేది మేమే’
దిశ, తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకునేందుకే పుట్టినట్లుందని, సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ టీఆర్ఎస్ ఎజెండాగా తన మేనిఫెస్టోను రూపొందించుకొని ఆ పార్టీ అధినాయకత్వం పనిచేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వేగంగా పతనమవుతున్న పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో 60 వేల కోట్ల అప్పు మాత్రమే చేస్తే.. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలోనే 3 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరతరాలు తీర్చలేనంత అప్పు చేశాడని విమర్శించారు. అప్పులతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నాడని, ఇందులో కూడా 8 శాతం కమిషన్ తీసుకొని కోట్ల రూపాయాలు కొల్లగొట్టారన్నారు.
టీఆర్ఎస్ నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని.. హైదరాబాద్ నుంచి హుజుర్ నగర్, భద్రాచలం వరకు భూములన్నింటినీ కబ్జా చేశారన్నారు. మంథనిలో న్యాయవాద దంపతులను నడి రోడ్డుపై పట్ట పగలు టీఆర్ఎస్ నాయకులు హత్య చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ యువత ఆత్మ బలిదానాలకు చలించే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని భావించామని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.