పూర్తి భాధ్యత… ప్రభుత్వమే భరించాలి

by Shyam |   ( Updated:2020-08-23 07:47:24.0  )
పూర్తి భాధ్యత… ప్రభుత్వమే భరించాలి
X

దిశ, సూర్యాపేట: శ్రీశైలం జల విద్యుత్ ఉప కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ నాయక్ తండాకు చెందిన ఏఈ సుందర్ నాయక్ మృతిచెందాడు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో పలుమార్లు ఉన్నత అధికారులకు చెప్పినా, వినకుండా నిర్లక్ష్యం వహించడం మూలంగా అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన ప్రతి ఉద్యోగి కుటుంబనికి ఉద్యోగ అవకాశం, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అన్నారు.

Advertisement

Next Story