టీపీసీసీ కార్యదర్శి కల్పన మృతి.. టీపీసీసీ సంతాపం

by Shyam |   ( Updated:2021-08-19 01:59:29.0  )
టీపీసీసీ కార్యదర్శి కల్పన మృతి.. టీపీసీసీ సంతాపం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ మహిళా నాయకురాలు కల్పన లివర్​ కాన్సర్​తో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. కల్పన అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా, ఐడిఎమార్సీలో కీలకంగా పని చేసిన క్రమశిక్షణ గల నాయకురాలు కల్పన అని కొనియాడారు. ఆమె చిన్న వయసులో లివర్ కాన్సర్‌తో మృత్యువాత పడడం అత్యంత బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రేవంత్ ‌రెడ్డి తెలిపారు. అదే విధంగా టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేష్​ కుమార్​ గౌడ్​ సంతాపం వ్యక్తం చేశారు. కల్పన అంత్యక్రియల్లో టీపీసీసీ తరుపున ఎమ్మెల్యే సీతక్క, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్​, ఎస్సీ సెల్​ చైర్మన్​ ప్రీతంలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story