- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ మార్క్ రాజకీయం.. గులాబీ పార్టీలో కౌంట్ డౌన్ స్టార్ట్
దిశ, జడ్చర్ల : రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్‌గా పేరొందిన రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్‌లో నూతనోత్సాహం కనబడుతోంది. రేవంత్ పీసీసీ పగ్గాలు అందుకున్నాక చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఇన్ని రోజులు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలమూరు జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించినట్టు క్యాడర్ గుసగుస లాడుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి తన సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో పాల్గొనడానికి రేవంత్ వస్తున్న నేపథ్యంలో తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఈ ప్రాంతం నుండే తన మార్కు చూపించాలన్న తపనతో ఉన్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే వ్యూహం అమలుపరిచే బాధ్యత మిడ్జిల్ కాంగ్రెస్ నాయకులపై ఉంచినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మిడ్జిల్ ఎంపీపీ కాంతమ్మను తిరిగి సొంతగూటికి రప్పించడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతుడైనట్టు స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తం మీద రేవంత్ పాలమూరు రాక అధికార పార్టీలో సెగలు రాజేసిందని చెప్పవచ్చు. మండలంలోని చాలా మంది అధికార పార్టీ నాయకులు ఇప్పటికే రేవంత్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.