కాంగ్రెస్‌లో జోష్.. అభ్యర్థి వెంకట్‌కు రేవంత్ రెడ్డి కీలక హామీ

by Sridhar Babu |
huzurabad-revanth
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్థితో నామినేషన్ వేయించేందుకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బైపోల్‌లో తమ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన మేరకు NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయనుండగా, ఈ కార్యక్రమానికి TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. దీంతో గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఉప ఎన్నిక కోఆర్డినేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

నామినేషన్ సందర్బంగా జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలను తరలించాలని కోరారు. అలాగే బూత్ స్థాయిలో బాధ్యులను నియమించి ప్రచారం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఏఐసీసీ మెంబర్ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నాగుల సత్యనారాయణ గౌడ్, ఈర్ల కొమురయ్య, మాజీ శాసనసభ్యులు విజయ రమణ రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ నాయకులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్తి కృష్ణా రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మడుపు మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed