- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం: ఉత్తమ్
X
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిస్తూ, స్థానిక సంస్థలను టీఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన గాంధీభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అక్రమ సంపాదనతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కొంటున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు, రుణమాఫీ చేయకుండా త్వరలోనే రైతులకు తీపి కబురు చెబుతానని సీఎం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజాం, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో సాగు అవుతోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమీషన్ల కోసమే నిర్మించారని విమర్శించారు. కాంగ్రెస్ బలోపేతానికి కమిటీలను నియమించుకొని ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Advertisement
Next Story