రేవంత్ పక్కా ప్లాన్.. వారితో మంతనాలు షురూ!

by Shyam |
TPCC chief Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అసంతృప్తి నేతలను చల్లబర్చేందుకు టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ అంశంలో రేవంత్‌ను వ్యతిరేకించిన మాజీ ఎంపీ వీ.హనుమంతరావును హైదర్‌‌గూడ ఆపోలో ఆస్పత్రికి వెళ్లి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్‌కు వీహెచ్ అభినందనలు తెలిపారు. వీహెచ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన రేవంత్.. త్వరగా కోలుకోవాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ద్రోహి కేసీఆర్ అని ఆరోపించారు. వీహెచ్ ఆస్పత్రిలో ఉన్నా ప్రజా సమస్యలపై చర్చించారని, దళితుల విషయంలో కమిటెడ్‌గా ఉన్నారని, సీఎం కేసీఆర్ దళితులకు చేస్తున్న ద్రోహంపై పోరాడాలని సూచించారన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతానని తట్టెడు మట్టి కూడా తీయలేదని, దళిత ఎంపవర్‌మెంట్, నియోజకవర్గానికి వంద కుటుంబాలకు సాయం అనడం ద్రోహమేనన్నారు. వీహెచ్ సలహాలు తీసుకుని ముందుకెళ్తానని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

Rewanth-Reddy

సీనియర్లతో మంతనాలు

రాష్ట్ర కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. సోమవారం ఉదయం మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. అనంతరం అక్కడ నుంచి హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావును కలిసి పరామర్శించారు. అంతకు ముందు రేవంత్​రెడ్డి ఇంటికి వెళ్లి వైఎస్​అనుచరుడు సూరీడు అభినందనలు తెలిపారు. అదేవిధంగా హుజురాబాద్​కాంగ్రెస్ నేత కౌశిక్​రెడ్డి, మెదక్ జిల్లా నేత శ్రవణ్ కుమార్​రెడ్డి.. రేవంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తన దగ్గరకు వచ్చిన నేతలతను కలుస్తూనే.. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో కూడా భేటీ అవుతున్నారు. కొంతమందిని ఫోన్‌లో పలుకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు రేవంత్​ఫోన్ చేసి సహకరించాలంటూ కోరుతున్నారు. సోమవారం రాత్రి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఇంటిలో తేనీటి విందు ఇచ్చారు. రేవంత్‌తో పాటు ఎన్నికల కమిటీ ఛైర్మన్​దామోదర రాజనర్సింహా పాల్గొన్నారు. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు ఎంత మేరకు లాభిస్తాయో చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed