- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లను కొట్టి చంపండి.. రేవంత్ సంచలన ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు వెంటనే రాజీనామా చేయాలని, అలాంటి నేతలను రాళ్లతో కొట్టాలని టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యేవరకు పోరాటం చేస్తానన్నారు. టీపీసీసీ చీఫ్నియామకం తర్వాత రేవంత్.. కాంగ్రెస్నేతల వద్దకు వెళ్లి కలుస్తున్నారు. దానిలో భాగంగా శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శులు చల్లా వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, సిరిసిల్ల నియోజకవర్గ నేత కేకే మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు.
అదే విధంగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని, అలా కొట్టడంలో తానే ముందుంటానన్నారు. కష్టపడి గెలిపించిన కార్యకర్తలను కాదని అమ్ముడుపోయారని, అలాంటి సన్యాసులకు సిగ్గు ఉండాలని ఘూటుగా వ్యాఖ్యానించారు. దీనిపై పోరాటం చేస్తానని, అవసరమైతే స్పీకర్‌పై కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ పశువులను కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొన్నాడని, అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పుతారన్నారు.