టీఆర్ఎస్, బీజేపీ ఒకగూటి పక్షులేనా..? రేవంత్ గురి మిస్సవ్వదా..!

by Sridhar Babu |
revanth-comments 1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీపీసీసీ చీఫ్ గా అపాయింట్ అయిన రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికలే లక్ష్యంగా అటాక్ చేశారు. ఒక్క డైలాగ్ తో అటు టీఆర్ఎస్ ను ఇటు బీజేపీని ఇరకాటంలో పెట్టేశారు. ఏఐసీసీ అలా టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని ప్రకటించిన కొద్ది సేపట్లోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం లేపాయి. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కేసీఆర్ కోవర్టని, బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆరోపించారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ బై పోల్స్ తన టార్గెట్ అని రేవంత్ రెడ్డి ఈ స్టేట్ మెంట్ తో స్పష్టం చేశారు. ఈటల రాజీనామాతో ఇప్పటికే అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ అన్న పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదని హుజురాబాద్ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని వేవ్ తీసుకరావల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నది వాస్తవం. ఇదే విషయాన్ని పసిగట్టిన రేవంత్ హుజురాబాద్ లో కాంగ్రెస్ ఉనికిని చాటాలన్న లక్ష్యంతోనే ఈ విమర్శలు చేసి ఉంటాడని భావిస్తున్నారు.

సీఎం వర్సెస్ ఎంపీలు..

హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో ఓ ముఖ్యమంత్రి, ఇద్దరు ఎంపీల మధ్య జరగనున్న పోటీ అన్నట్టుగా సాగే అవకాశాలు లేకపోలేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. తమ పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం ముగ్గురు కూడా వ్యూహ ప్రతి వ్యూహాలు వేస్తూ సాగే ఎన్నికల సీన్ కాస్తా రంజుగా మారే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story