టయోటా ఉత్పత్తిలో స్థానికీకరణకు ప్రణాళిక

by  |
టయోటా ఉత్పత్తిలో స్థానికీకరణకు ప్రణాళిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా కిర్లొస్కర్ మోటార్(టీకేఎం) తన ఉత్పత్తులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానికీకరించేందుకు, సరఫరా గొలుసులో ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. దేశీయంగా కార్ల తయారీలో ఎక్కువగా స్థానికీకరణకు ప్రాధాన్యమివ్వడమే కాకుండా, హైబ్రిడ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పరిశీలిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

టీకేఎం సీనియర్ వైస్ ప్రెసిడెట్ నవీన్ సోనీ మాట్లాడుతూ..తమ కంపెనీ ఉత్పత్తిలో స్థానికీకరణ వల్ల ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా చొరవకు తోడ్పాటు అందిస్తుందని, అంతేకాకుండా సరఫరా వ్యవస్థలో ఉన్న సవాళ్లను తగ్గించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. ఇన్నోవా క్రిస్టా మోడల్‌కు అవసరమైన ఇంజిన్ ఇప్పుడు స్థానికంగానే తయారవుతోంది. ఇంజిన్‌లో ఉపయోగించే దాదాపు 85 శాతం విడిభాగాలన్నీ స్థానికంగానే తయారవుతున్నాయి. క్రమంగా గేర్ బాక్సులు, ఇతర క్లిష్టమైన విడిభాగాలను కూడా స్థానికంగా తయారు చేసే ప్రణాళిక రూపొందిస్తున్నామని నవీన్ సోనీ వివరించారు. అలాగే, దేశంలో స్థానికంగా హైబ్రిడ్ వ్యవస్థలను తయారుచేయాలని యోచిస్తోందన్నారు. అయితే, సంస్థ ఖచ్చితమైన ప్రణాళికలను వివరించలేదు.


Next Story

Most Viewed