కరోనాతో దెబ్బతిన్న పర్యాటకం

by Harish |
కరోనాతో దెబ్బతిన్న పర్యాటకం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా భారత ప్రయాణ, పర్యాటక రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ రంగాలకు అనుసంధానంగా ఉన్న మొత్తం వ్యాపారాలు రూ. 5 లక్షల కోట్లు కోల్పోయే అవకాశముందని పరిశ్రమల ఛాంబర్ సీఐఐ, హాప్సిటాలటీ కన్సల్టింగ్ సంస్థ హోటలివేట్ నివేదిక వెల్లడించింది. కేవలం పర్యాటక రంగం మాత్రమే సుమారు రూ. 1.8 లక్షల కోట్లు కోల్పోయే అవకాశముందని సీఐఐ-హోటలివేట్ నివేదిక పేర్కొంది. పరిశ్రమ మనుగడకు తక్షణ చర్యలు అవసరమని, లేదంటే కోలుకోవడం అసాధ్యమని నివేదిక అభిప్రాయపడింది.

వచ్చే ఏడాది ప్రారంభం నాటికి 30 శాతం హోటళ్లు మాత్రమే కొనసాగించే అవకాశాలున్నాయని, ప్రస్తుతం ఈ హోటళ్లు 80 శాతం నుంచి 85 శాతం ఆదాయం కోల్పోతున్నాయని నివేదిక వెల్లడించింది. కరోనా సంక్షోభం కారణంగా ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్ల ఆదాయం నష్టం సుమారు రూ. 35,070 కోట్లని నివేదిక పేర్కొంది. అయితే, పరిస్థితులు సానుకూలంగా మారితే పరిశ్రమల ఆదాయం 10-15 శాతం మెరుగుపడే అవకాశాలున్నాయని ఆన్‌లైన్ ట్రావెల్ సర్వీసెస్ సంస్థ మేక్ మై ట్రిప్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed