- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇల్లు లేని పేదలకు ఇళ్లివ్వడమే లక్ష్యం
దిశ, విశాఖపట్నం : రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత ఇల్లు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పర్యాటకశాఖ మంత్రి మత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వాలిమెరక గ్రామంలో పేదలందరికీ ఇల్లు పథకం లో మహిళలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు.
జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రకటించిన పేదలందరికీ ఇల్లు భారీ సంక్షేమ కార్యక్రమం అని తెలియజేశారు. రాష్ట్రంలో మూడు పండుగలు జరుగుతున్నాయని, ముక్కోటి ఏకాదశి క్రిస్టమస్, మహిళలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే పండగ అని మంత్రి వర్ణించారు. సంక్షేమ పథకాలన్నీ మహిళలకే ఇస్తున్నామని, మహిళలకు గౌరవం ఇచ్చిన చోట దేవతలు నడయాడుతారని రాష్ట్రం సుభిక్షంగా ఉందని అని చెప్పారు. మహిళలపై ఎటువంటి అఘాయిత్యం జరిగిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం చేస్తున్నారని చెప్పారు.