- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దాడికి పాల్పడ్డ టూరిజం డిప్యూటీ మేనేజర్ సస్పెండ్
దిశ, ఏపీ బ్యూరో: మాస్కు పెట్టుకోవాలని సూచించినందుకు తోటి ఉద్యోగినిపై విచక్షణా రహితంగా దాడి చేసిన అధికారి ఎట్టకేలకు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే… నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణి, కరోనా నేపథ్యంలో మాస్కు పెట్టుకోవాలని పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావుకి సూచించారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఉషారాణిపై విచక్షణారహితంగా దాడి చేశారు. జుట్టు పట్టకుని కుర్చీలో నుంచి కింద పడేసి.. కుర్చీ హ్యాండిల్‌తో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 27న జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు.