MANAME OTT: 5 నెలల తర్వాత ఓటీటీకి రానున్న శర్వానంద్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Kavitha |
MANAME OTT: 5 నెలల తర్వాత ఓటీటీకి రానున్న శర్వానంద్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, సినిమా: శ‌ర్వానంద్ హీరోగా, యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన సినిమా ‘మ‌న‌మే’. ఇక శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ నెలలో థియేటర్లలో రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. అయితే తాజాగా ఈసినిమా ఓటీటీ అడ్డంకులు తొల‌గిపోయిన‌ట్లు స‌మాచారం. ఐదు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. బేసిక్‌గా అయితే ఈ చిత్రం ఆగ‌స్ట్‌లోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యంలో నెల‌కొన్న వివాదం కార‌ణంగా ఓటీటీ రిలీజ్ వాయిదాప‌డుతూ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా ‘మ‌న‌మే’ ఓటీటీ, శాటిలైట్ వివాదం ఇప్పుడు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో మ‌న‌మే మూవీ ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్ ద‌క్కించుకున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఇక త్వర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్నట్లు ఇన్‌సైడ్ వర్గాల టాక్.

Advertisement

Next Story

Most Viewed