టొరెంట్ ఫార్మా నికర లాభం రూ. 310 కోట్లు

by Harish |
టొరెంట్ ఫార్మా నికర లాభం రూ. 310 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఔషధ సంస్థ టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 27.04 శాతం పెరిగి రూ. 310 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 244 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు టొరెంట్ ఫార్మా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం రూ. 2,017 కోట్లుగా నమోదైందని, గతేడాది ఈ కాలంలో రూ. 2,005 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.

ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంస్థ మొత్తం ఆదాయం గతేడాది రూ. 899 కోట్లు నమోదవగా, ఈసారి ఆదాయం రూ. 963 కోట్లకు పెరిగినట్టు టొరెంట్ ఫార్మా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ త్రైమాసికంలో సంస్థ మొత్తం ఖర్చులు గతేడాది నమోదైన రూ. 1,743 కోట్ల నుంచి రూ. 1,639 కోట్లకు పడిపొయినట్టు పేర్కొంది. కాగా, సోమవారం టొరెంట్ ఫార్మా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ధర 2.92 శాతం తగ్గి రూ. 2,654.45 వద్ద ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed