- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. మరో 48 గంటలు తీరని గండమే!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కనికరం చూపించేలా లేడు. ఇప్పటికే 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో 48 గంటల పాటు వరుణగండం వెంటాడుతోంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరికొద్ది సేపట్లో ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అధికంగా ఉండనుండగా.. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. సోమవారం ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని, గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, అందువల్ల గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని శ్రీనివాస్ హెచ్చరించారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నంబరు హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.