- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఆ సర్వే ఇన్‌టైమ్‌లో పూర్తి చేయాలి’
దిశ, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తుల ఆన్లైన్ నమోదు సర్వేను సకాలంలో పూర్తి చేయాలని భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, సూర్యాపేట జిల్లా జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం, తిరుమలగిరి మండలాలలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఏ కాలనీలో సర్వే నిర్వహిస్తారో అక్కడి ప్రజలకు ఒక రోజు ముందే తెలియజేయాలని సూచించారు.
అదేవిధంగా సర్వేకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల యజమానులను సిబ్బంది సర్వే కోసం వివరాలు అడుగుతున్న తీరును పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రొఫార్మా, యాప్‌లో ఉన్న వివరాలన్నింటినీ కచ్ఛితంగా నమోదు చేయాలని సూచించారు. నెట్‌వర్క్ సమస్య కారణంగా యాప్‌లో వివరాలు త్వరగా అప్‌లోడ్ కావడం లేదని, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. ధరణి సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం యజమానులకు మెరున్ కలర్ పాస్ బుక్‌లు జారీ చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు ఇస్తున్న రుణాలను మోత్కూర్‌లో బ్యాంకు మేనేజర్లు త్వరగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, మేనేజర్లతో మాట్లాడి త్వరగా రుణాలు ఇప్పించాలని కమిషనర్‌ను ఆదేశించారు.
సర్వేకు సిగ్నల్ పాట్లు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి ఆస్తుల ఆన్లైన్ నమోదు సర్వేకు సిగ్నల్స్ సమస్యలు ఎదురవుతున్నాయి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో సర్వేకు సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో రోజుకు 10 ఇళ్లు కూడా పూర్తి కావడం లేదని, అధికారులు వాపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి, కమిషనర్ పోరెడ్డి మనోహర్ రెడ్డి, మేనేజర్ జి.శంకర్, సిబ్బంది సోమయ్య, రాంబాబు, అనిల్, మత్స్యగిరి ఆయన వెంట ఉన్నారు.