ఆ ముగ్గురికి ఇదే చివరి ఐపీఎల్ ?

by Shyam |
ఆ ముగ్గురికి ఇదే చివరి ఐపీఎల్ ?
X

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్(International cricket) నుంచి ఆటకు వీడ్కోలు పలికినా చాలా మంది ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఆడుతున్నారు. తాజాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ, రైనాలు కూడా ఐపీఎల్ ఆడుతున్నారు. అయితే కొంత మంది క్రికెటర్లకు ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 13వ సీజనే చివరిదనే వార్తలు వినిపిస్తున్నాయి. వారి వయసు, ప్రదర్శన ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇదే తమ చివరి ఐపీఎల్ సీజన్ అని మాత్రం బయటకు వెల్లడించలేదు. క్రికెట్ విశ్లేషకులు ముగ్గురి పేర్లను మాత్రం బయటకు వెల్లడిస్తున్నారు. అందులో ముఖ్యమైన పేరు హర్భజన్ సింగ్(Harbhajan Singh). టీం ఇండియా(India) స్పిన్‌కు ఒకప్పుడు వెన్నెముకగా నిలిచిన ‘టర్బోనేటర్’ ఐపీఎల్‌లో కూడా అత్యంత విజయవంతమైన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

గత ఏడాది 11 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 16 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ కొన్ని మ్యాచ్‌లలో కీలక వికెట్లు తీయడం వల్లే సీఎస్కే(CSK) జట్టు 12వ సీజన్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ ఏడాది తర్వాత ఐపీఎల్‌ నుంచి హర్భజన్ నిష్క్రమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ముంబై ఇండియన్స్ (MumbaiIndians) జట్టుకు ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న లసిత్ మంలిగ (Manliga) కూడా ఐపీఎల్‌ను వీడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు 122 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మలింగ మొత్తం 170 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆయన పేరు మీదే ఉన్నది. 2018లోనే బౌలింగ్ మెంటార్‌గా మారిన మలింగ.. తిరిగి గత ఏడాది ఆటగాడిగా మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే ఇకపై అతను ఐపీఎల్‌లో ఆటగాడిగా కొనసాగే అవకాశాలు లేనట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక మూడో పేరు దక్షిణాఫ్రికా(South Africa)కు చెందిన డేల్ స్టెయిన్(Dale Stein). ఐపీఎల్‌లో పలు జట్లకు ఆడిన స్టెయిన్ ఇప్పటి వరకు 96 వికెట్లు తీశాడు. గత ఏడాది గాయం కారణంగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లే ఆడాడు. ఆర్సీబీ(RCB)తో ఒప్పందం మేరకు ఈ ఏడాది మాత్రమే ఐపీఎల్ ఆడనున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed