ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగితే.. అంతే సంగతి..!

by Sujitha Rachapalli |
ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగితే.. అంతే సంగతి..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఎనర్జీ డ్రింక్… యూత్ ఎక్కువ ఇష్టపడి తాగే ఎనర్జీ డ్రింక్స్ గురించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. సాధారణంగా ఈ డ్రింక్స్ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని చాల మంది నమ్ముతారు, అందుకే వీటిని ఎక్కువగా తాగుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా తాగడం వల్ల శక్తి ఎంత వస్తుందో చెప్పలేం కానీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ది పసిఫిక్ సైంటిస్టులు 18 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ వయసున్న వారిపై కొన్ని ప్రయోగాలు చేశారు. ఇందులో తేలిన విషయం ఏంటంటే 304 నుండి 320 గ్రాముల కెఫిన్ కలిసిన 32 ఔన్సుల ఎనర్జీ డ్రింక్ తాగిన వారిలో గుండె స్పందనల్లో తీవ్ర మార్పులు చేసుకున్నట్లు తేలింది. ఈ డ్రింక్స్ తగిన వారిలో హృదయ స్పందనలు 6 మిల్లి సెకండ్ల నుండి 7.7 మిల్లి సెకండ్లు పెరిగినట్లు గుర్తించారు. ఇది ప్రాణాలకే ముప్పు తీసుకువస్తుందని, కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగడాన్ని తగ్గిస్తే మంచిదని చెబుతున్నారు పరిశోధకులు.

Advertisement

Next Story

Most Viewed