టామ్ హ్యాంక్స్ దంపతులకు కరోనా

by Shyam |
టామ్ హ్యాంక్స్ దంపతులకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్:

హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య నటి, సింగర్ రీటా విల్సన్‌లకి కరోనా వైరస్ సోకింది. కొద్దిగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న తాము పరీక్ష చేయించుకోగా కరోనా వైరస్ ఉన్నట్లు తేలిందని టామ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించారు.

‘హలో.. నేను, రీటా ఆస్ట్రేలియాలో ఉన్నాం. కొద్దిగా అలసట, జలుబు, ఒళ్లు నొప్పులుగా ఉన్నట్లు అనిపించింది. రీటాకి జ్వరం కూడా ఉంది. ఎందుకైనా మంచిదని కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నాం. పాజిటివ్ అని తేలింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అందరిలాగే తమను కూడా మెడికల్ అధికారులు ఐసోలేట్ చేస్తూ అబ్జర్వేషన్‌లో ఉంచడానికి సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎల్విస్ ప్రెస్లీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో టామ్ నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కోసమే ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది.

Tags : Tom Hanks, Rita Wilson, Corona, COVID 19, Twitter, Australia

Advertisement

Next Story

Most Viewed