రాజకీయాలలోకి జగపతిబాబు.. అలా ఉండాలనుకోవడం లేదట

by Shyam |   ( Updated:2021-07-07 01:24:00.0  )
jagapathi babu news
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటో షూట్ లు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ ఫోటోలకు నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం సాధారణమే.. అప్పుడప్పుడు నెటిజన్ల ప్రశ్నలకు సెలబ్రెటీలు రీ కౌంటర్లు ఇవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లు హాట్ ఫోటోలు పెడితే.. సూపర్ అనేవారు కొంతమంది.. ఎందుకు ఇలాంటివి పోస్ట్ చేశారు అనేవాళ్ళు ఇంకొంతమంది.. మరి ఒక నటుడు ఒక డీసెంట్ ఫోటో పోస్ట్ చేస్తే.. దాని వెనుక కారణం ఏంటని..? ఆరా తీసే నెటిజన్లు లేకపోలేదు.

తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబుకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆయన తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో వైట్ కుర్తా.. పైజమా వేసుకొని చేతిలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని గోడపై కూర్చొని చాలా డీసెంట్ గా కనిపించారు. ఆ ఫోటో చూస్తే దర్శకుల మదిలో కొత్త క్యారెక్టర్ మెదిలేలా ఆయన ఫోటో ఉంది. కానీ, ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం వైట్ అండ్ వైట్ వేసుకున్నారు.. డైనమిక్ పొలిటిషియన్ లా కనిపిస్తున్నారు.. మీరు త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..? అని అడగడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నకు జగపతి బాబు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ‘ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు’ అని బదులిచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరికొంతమంది నెటిజన్లు ఏదో లుక్ కోసం వైట్ అండ్ వైట్ వేసుకొని ఫోటో దిగితే రాజకీయాలు అంటగడతారా..? అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం జగపతిబాబు ‘టక్‌ జగదీష్‌’ ‘మహాసముద్రం’, ‘రిపబ్లిక్‌’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement

Next Story