టాలీవుడ్ డ్రగ్స్ బాగోతం బయటపెట్టిన రవితేజ డ్రైవర్.. కెల్విన్ ముందే విచారణ..?

by Anukaran |   ( Updated:2021-09-09 00:21:33.0  )
టాలీవుడ్ డ్రగ్స్ బాగోతం బయటపెట్టిన రవితేజ డ్రైవర్.. కెల్విన్ ముందే విచారణ..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ఈడీ వేగవంతం చేసింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారంతో సినీ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాధ్, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నటుడు నందు, హీరో రానా విచారణకు హాజరుకాగా.. తాజాగా మరో హీరో రవితేజ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. గురువారం రవితేజ, అతడి డ్రైవర్ శ్రీనివాస్ తో పాటు ఈడీ ఎదుట హాజరయ్యారు. కారు దిగిన వెంటనే మీడియా చుట్టుముట్టడంతో ఎక్కడా ఆగకుండా పరుగులు తీసుకుంటూ రవితేజ పైకి వెళ్లారు.

ఇక కెల్విన్ నుంచి రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కి డ్రగ్స్ అందాయని ఈడీ దృష్టికి రావడంతో అతనిని కూడా అధికారులు విచారించనున్నారు. అంతేకాకుండా మనీలాండరింగ్ ,ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రవితేజతో పాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌ను విచారించనున్నారు. గతంలో కూడా వీరు ఎక్సైజ్ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ద్వారానే టాలీవుడ్ డ్రగ్స్ బాగోతం బయటపడింది. శ్రీనివాస్, కెల్విన్ మధ్య జరిగిన లావాదేవీల ఆధారంగానే సినీ ప్రముఖులు వెలుగులోకి వచ్చారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ, శ్రీనివాస్ కి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించనున్నారు. రవితేజకు , కెల్విన్ కు మధ్య సంబంధాన్ని ఆరా తీయనున్నారు. రానా, రకుల్ తో పాటు రవితేజ కూడా F- కేఫ్ పార్టీలకు హాజరవ్వడంతో వాటిపై కూడా విచారణ జరపనున్నారు. నిందితుడు కెల్విన్ ఎదుటే ఈ విచారణ జరగనుంది.

Advertisement

Next Story