- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలనంగా మారిన నవదీప్ విచారణ.. పార్టీలు జరుగుతున్నాయని నీకెలా తెలుసు..?
దిశ, ప్రత్యేక ప్రతినిధి: గచ్చిబౌలిలోని ఎఫ్ క్లబ్ లో ఏం జరిగింది? డ్రగ్స్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు? సరఫరా ఎలా జరగింది? ఏ ఖాతాల నుంచి లావాదేవీలు చేశారు? అంటూ ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్లు, సినీ నటుడు నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన హీరో నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్లను ఈడీ అధికారులు 9 గంటలపాటు విచారించారు. వారి బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకున్న ఈడీ అధికారులు అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించారు. మొదటిగా ఎఫ్-క్లబ్ మేనేజర్‌ను ఇంటరాగేట్ చేశారు. మీ క్లబ్‌లో పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు? అక్కడ ఎలాంటి పార్టీలు జరిగేవి? సినీ ప్రముఖుల కుటుంబాల నుంచి ఎవరెవరు వచ్చారు? డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్, ఈవెంట్ మేనేజర్ జీషాన్‌అలీతో ఏ విధమైన సంబంధాలున్నాయి? అంటూ ప్రశ్నిం చారని సమాచారం. ఎఫ్-క్లబ్ కరెంటు ఖాతాల్లోకి, వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి, 2015 నుంచి 2017 వరకు జరిగిన లావాదేవీల వివరాలు ఎఫ్-క్లబ్ మేనేజర్ నుంచి ఈడీ అధికారులు సేకరించినట్టు సమాచారం.
మీరెందుకు ఆహ్వానాలు పంపేది?
హీరో నవదీప్‌పై ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీకు సినీ పరిశ్రమలో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి? వాళ్లలో తరచూ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యేవారు? ఫలానా చోట పార్టీలు జరుగుతున్నాయి.. అనే వివరాలను సినీ ప్రముఖుల వాట్సప్ మీరెందుకు పంపేవారు? డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్, జీషాన్ అలీ, ఎఫ్-క్లబ్ మేనేజర్‌తో ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగేవి?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. 2015 నుంచి 2017 వరకు నవదీప్ బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను సైతం ఈడీ అధికారులు తీసుకున్నారు. గతంలో ఎక్సైజ్‌శాఖ జరిపిన డ్రగ్స్ కేసు విచారణలోనూ నవదీప్‌ను కీలకంగా ప్రశ్నించారు. అప్పట్లో నవదీప్ వాట్సప్ నంబర్ నుంచి పలువురు సినీ తారలకు పార్టీలకు రావాలంటూ ఆహ్వానిస్తూ పంపిన వందల కొద్దీ మెసేజ్‌లను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వాటి పైనా ఈడీ అధికారులు మరోమారు ఆరా తీసినట్టు తెలిసింది. అవసరం మేరకు మరోమారు విచారణకు రావాల్సి ఉంటుందని నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్లకు ఈడీ అధికారులు సూచించారు.