రవితేజ విచారణలో ట్విస్ట్.. జిషాన్‌ ఎంట్రీతో ఉత్కంఠ

by Sumithra |   ( Updated:2021-09-09 04:58:35.0  )
Drugs case
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తోంది. బుధవారం హీరో రానాను విచారించిన ఈడీ దర్యాప్తు బృందం, నేడు మరో హీరో రవితేజను విచారిస్తున్నారు. రవితేజకు ఈడీ అధికారులు నోటీసులివ్వడంతో గురువారం డ్రైవర్‌తో కలిసి బ్యాంకు వివరాల ఫైల్స్‌తో ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ దర్యాప్తులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కీలకంగా ఉన్నారు. గతంలో డ్రైవర్‌ని ప్రశ్నించడం ద్వారానే రవితేజ డ్రగ్స్ కేసులో ఉన్నాడనే విషయం ఈడీ గుర్తించింది. డ్రగ్స్ కేసులో జిషాన్ కీలక సూత్రదారిగా ఉండగా.. నేడు రవితేజను విచారిస్తుండగా మధ్యలో కెల్విన్ స్నేహితుడు జిషాన్‌ను విచారణకి తీసుకురావడంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఇంకా విచారణ జరుగుతోంది.

Advertisement

Next Story