ఒలింపిక్స్ పతకాలతో పాటు పుష్ఫగుచ్ఛాలు.. ఎందుకిస్తారో తెలుసా?

by Anukaran |   ( Updated:2023-10-10 11:49:40.0  )
ఒలింపిక్స్ పతకాలతో పాటు పుష్ఫగుచ్ఛాలు.. ఎందుకిస్తారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: విశ్వక్రీడ యవనికపై అథ్లెట్లు తమ జీవితకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తు్న్నారు. పతకాలు ఒడిసిపట్టుకుంటూ తమ దేశపతాకాన్ని రెపరెపలాడిస్తూ.. దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు. అయితే గెలిచిన ఆ ధీరులకు ‘మెడల్స్’ అందించడం సాధారణమే కానీ ప్రత్యేకంగా పుష్పగుచ్ఛాలను అందించడం వెనక ఓ మంచి ఉద్దేశం ఉందంటున్నారు నిర్వాహకులు. మరి అదెంటో తెలుసుకుందాం.

జపాన్‌‌లోని ఇవాటే, ఫుకుషిమా, మియాగి ప్రాంతాల్లో ఇప్పటివరకు పెనువిపత్తులు సంభవించాయి. భూకంపం, సునామి కారణంగా ఫుకుషిమా అణు కర్మాగారం కూడా పేలిపోవడంతో ఈ మూడు జిల్లాల్లో 20వేల మందికి పైగా మరణించారు. కాగా 2011లో ఈ ఘటన హృదయ విదారక సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. విపత్తులో చనిపోయిన వారి పిల్లలు తమ తల్లిదండ్రులకు గుర్తుగా పూలమొక్కలు నాటారు. అనేక పుష్పగుచ్ఛాల్లో కనిపించే పొద్దుతిరుగుడు పువ్వులు మియాగిలో పెరిగాయి. తెలుపు, నీలం, ఊదా పువ్వులు ఇతర రెండు జిల్లాల్లో పూసాయి. ఇక ఆకుపచ్చ ఆస్పిడిస్ట్రాస్‌ ఆకులు ఆతిథ్య నగరం టోక్యోను సూచిస్తాయి. ఈ పూలతోనే ఒలింపిక్స్ బోకేలు రూపొందిస్తుండటం విశేషం. ఒలింపిక్, పారా ఒలింపిక్ క్రీడల్లో 5వేలకు పైగా బొకేలను అథ్లెట్లకు అందజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed