పానీపూరిలో టాయ్‌లెట్ వాటర్.. వైరల్ వీడియో!

by Shyam |
పానీపూరిలో టాయ్‌లెట్ వాటర్.. వైరల్ వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్‌లో పానీపూరి లేక వాటిని ఇంట్లోనే కష్టపడి తయారుచేసుకుని తిన్నవారు చాలా మందే ఉన్నారు. అయితే బయటి టేస్ట్‌కు, ఇంట్లో టేస్ట్‌కు చాలా తేడా కనిపించడంతో మల్లీ రెండోసారి ప్రయత్నించలేదు. కానీ సడలింపులు ప్రారంభమయ్యాక పానీపూరి సెంటర్లు మొదలయ్యాయి. దీంతో ఇన్నాళ్లు నాలుక కట్టుకుని కూర్చున్నవాళ్లందరూ ఎగబడ్డారు. మరి పానీపూరి ప్రియులు ఇలా ఎగబడటాన్ని పానీపూరి అమ్మేవాళ్లు ఆసరాగా తీసుకున్నారో ఏమో తెలియదుగానీ, లాక్‌డౌన్‌లో పోగొట్టుకున్న గిరాకీని కూడా ఇప్పుడే రాబట్టే ప్రయత్నంలో భాగంగా అడ్డదారులు తొక్కుతున్నారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని రంకాలా లేక్ వద్ద ‘ముంబై కీ స్పెషల్ పానీపూరి వాలా’ బండి ఉంటుంది. పేరుకు తగ్గట్టే ఇది చాలా స్పెషల్ అని ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ఇక్కడికి రోజూ ఎంతో మంది వచ్చి పానీపూరి తిని వెళ్తారు. ఎప్పుడు చూసినా ఈ బండి రద్దీగానే ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అందుకు స్పెషల్ అని అనడం లేదు. ఈ పానీపూరి బండి నడిపే వ్యక్తి.. పక్కన ఉన్న టాయ్‌లెట్ నుంచి నీళ్లను తీసుకొచ్చి, పానీపూరి నీళ్లలో కలపడం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్లందరికీ పానీపూరి అంటేనే చిరాకు వస్తోంది. అలా చిరాకు పడిన కొందరు నేరుగా బండి దగ్గరికి వెళ్లి దాన్ని నాశనం చేశారు. అందుకే మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మరీ పానీపూరి తినాలనిపిస్తే బయటి నుంచి పూరీ తెచ్చుకుని, పానీ ఇంట్లోనే తయారుచేసుకోండి. పూరి తయారు చేయడం కష్టం కానీ, పానీ తయారు చేయడం చాలా ఈజీ… అదెలా తయారు చేయాలో చెప్పే యూట్యూబ్ వీడియోలు బోలెడు ఉన్నాయి.

Advertisement

Next Story