- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Results: తెలంగాణలో టెన్త్ ఫలితాలు.. ఫీజు చెల్లించిన అందరూ పాస్..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సిబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా మొదటి వేవ్ తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. యథావిధిగా విద్యార్థులు స్కూళ్లకు హాజరు అవుతున్న సమయంలో సెకండ్ వేవ్ మొదలులోనే టెన్షన్ పెట్టింది. అత్యధికంగా స్కూళ్లలోనే కరోనా పంజా విసరడంతో మరోసారి విద్యా సంస్థలను బంద్ చేశారు. దీంతో విద్యార్థులకు ఆయా స్కూల్ యాజమాన్యాలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు.
ఇదే సమయంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో పరీక్షలు నిర్వహించడం సరికాదని భావించిన ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించి గ్రేడ్లను ఫైనల్ చేసింది. ఈ ఏడాది మొత్తం 5,21,398 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించగా.. వీరిలో సగం మందికి పైగా 10 జీపీఏ దక్కే అవకాశం ఉండగా.. అందరూ పాస్ కానున్నట్టు సమాచారం.