అమరావతి రైతులకు చీకటి రోజు

by srinivas |   ( Updated:2020-07-31 07:27:04.0  )
అమరావతి రైతులకు చీకటి రోజు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి రైతులకు ఈరోజు చీకటి రోజు అని రాజధాని మహిళా రైతులు కీలక వ్యాఖ్యలు చేశారు. భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారని వాపోయారు. వైసీపీ, బీజేపీ కలిసి చేసిన కుట్రే ఇదని మండిపడ్డారు. బీజేపీ నేత సోమువీర్రాజు వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నారని, రాజధాని మహిళా రైతులు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాజధాని మహిళలు ఈ విధంగా స్పందించారు. అంతేకాదు, సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి. వికేంద్రీకరణ బిల్లును 3 వారాల కిందట జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలపడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్లే అని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed