- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుల్ మైగ్రేన్ .. కంట్రోల్ ఇలా?
దిశ, వెబ్‌డెస్క్ : మైగ్రేన్ లేదా పార్శ్వపు నొప్పి అనేది తలకు సంబంధించినది. దీనిని సాధారణ తలనొప్పిగా చెప్పలేము. ఇది చాలా వరకు తలలో వన్‌సైడ్ రాగా, ముఖ్యంగా ఇది ఆడవారిలో అధికంగా కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాయడం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలామంది మైగ్రేన్ తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ, కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావొచ్చు. ఈ రకం తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇది ఉన్నవారికి ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినాలనిపించదు., వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. వాస్తవానికి ఇవన్నీ పార్శ్వనొప్పిని ప్రేరేపించేవే గానీ.. పార్శ్వనొప్పికి మూలకారణాలు కావు. పార్శ్వనొప్పి అనేది జన్యుపరమైన సమస్య. వంశంలో ఎవరికైనా ఉంటే మనకూ రావచ్చు. పురుషుల్లోనూ ఉండొచ్చు గానీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది.దీనికి శాశ్వత నివారణ లేదు. కాకపోతే కంట్రోల్ చేయడానికి చికిత్సలున్నాయి. సరైన ట్రీట్‌మెంట్ పొందితే కొన్నాళ్లకు దానంతట అదే పోతుంది. కానీ, మళ్లీ తిరిగిరాలేదని చెప్పలేం.
వ్యాధి కారకాలు..
మైగ్రేన్ అనేది మానసిక ఆందోళన, ఒత్తిడికి ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను పదేపదే ఆలోచించడం వల్ల వస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి, అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది. మహిళల్లో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గానీ, తర్వాత గానీ వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ సమయం, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వంటి కొన్ని రకాల మందులు వాడటం వలన కూడా రావొచ్చు.
మైగ్రేన్ ఎంతసేపు ఉండొచ్చు..
మైగ్రేన్ సమస్య ఉన్నవారికి సాధారణంగా 24 నుంచి 72 గంటల్లో దాని తీవ్రత ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే తగ్గొచ్చు. ఒక్కొసారి ఆ నొప్పి 72 గంటలు కూడా ఉంటుంది. అప్పుడు దానిని ‘స్టేటస్ మైగ్రేన్’ అని పిలుస్తారు.
మైగ్రేన్ దశలు..
1. ప్రొడ్రోమ్ దశ : ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2రోజుల వరకు జరిగే ప్రక్రియ సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.
2. ఆరా దశ : ఈ దశ నొప్పి ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు మందగించడం, జిగ్‌జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన ఫీలింగ్, మాటల తడబాటు, కాళ్లల్లో నీరసం కనిపిస్తుంది.
3. నొప్పిదశ : ఇది 2గంటల నుంచి 3రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ దశలో వాంతులు కావొచ్చు. చాలా వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి చాలా సున్నితంగా అంటే చికాకుగా అనిపిస్తుంది.
4. పోస్ట్‌డ్రోమ్ దశ : నొప్పి తగ్గిన తర్వాత కొద్దిరోజుల వరకు తల భారంగా ఉండటంతో పాటు ఒళ్లంతా నీరసం, నిరాసక్తంగా ఉంటుంది. నొప్పులు ఉంటాయి.
వ్యాధి నియంత్రణకు చికిత్స..
1.రక్త పరీక్షలు-సీబీపీ, ఈఎస్‌ఆర్ 2. రక్తపోటును గమనించడం 3.ఈఈజీ పరీక్ష, సిటీ స్కాన్ (మెదడు) 4.ఎంఆర్‌ఐ మెదడు పరీక్షలు సహయపడతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మైగ్రేన్ రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళనలు, అతిగా ఆలోచనలు, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. తలకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. అలాచేస్తే తలలోని నరాలు సేదతీరుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతి లేనిచోట నిశ్శబ్దంగా ఉన్నచోట రెస్ట్ తీసుకోవాలి. పార్శ్వనొప్పి ఎప్పుడన్నా ఓసారి వేధిస్తుంటే, ఆ నొప్పి వచ్చినప్పుడు సాధారణ పెయిన్ కిల్లర్లు తీసుకుంటే సరిపోతుంది. అలాకాక తరచూ వస్తుంటే మాత్రం.. కొంతకాలం పాటు కొన్ని ప్రత్యేక చికిత్సతో పాటు మందులు వాడాలి. ఈ చికిత్సకు చాలా రకాల మందులున్నాయి. వీటిని వ్యక్తి లావు-సన్నం, స్త్రీలు-పురుషులు, పిల్లలు-వృద్ధులు ఇలా వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తారు. రెండు, మూడు నెలలకోసారి ఈ నొప్పి వస్తుంటే.. అది వచ్చినప్పుడు సాధారణ పెయిన్ కిల్లర్లు సరిపోతాయి. నెలకు రెండు, మూడు సార్లకంటే ఎక్కువగా వస్తున్నా, ఒక్కసారే వచ్చి మరీ ఎక్కువసేపు వేధిస్తున్నా అప్పుడు ప్రత్యేక మందుల గురించి ఆలోచించాలి.