- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ డేటాతో అనుమానితుల వేట
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మర్కజ్ మసీదులో తబ్లిఘీ జమాత్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వారిని గుర్తించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. దేశంలో కరోనా కేసులు ఒక్క ఉదుటున పెరగడానికి ఈ సదస్సుతో లింక్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ సదస్సులో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. గత నెల ఢిల్లీలో నిర్వహించిన జమాత్ సదస్సులో పాల్గొన్న వారిని.. ఆ సదస్సు పరిసరాల్లో ఉన్న వారిని గుర్తించేందుకు సెల్ ఫోన్ జీపీఎస్ లొకేషన్ సిగ్నల్ సమాచారాన్ని వినియోగిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మర్కజ్ ఈవెంట్ ను హాట్ స్పాట్ గా కేంద్రం గుర్తించాక క్రైమ్ బ్రాంచి రంగంలోకి దిగి దర్యాప్తు చేసిన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుతో సంబంధం ఉన్న సుమారు వెయ్యి మంది కరోనా బాధితులను 17 రాష్ట్రాల్లో గుర్తించినట్టు హోం శాఖ వెల్లడించింది. అంటే దేశంలో వెలుగు చూసిన కేసుల్లో మూడింట ఒకటి ఈ సదస్సుకు లింకు ఉన్నదే. సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా సుమారు 9000 మంది ఈ సదస్సులో పాల్గొన్న ట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ 9 వేల మంది.. వారితో కాంటాక్ట్ అయిన వారిని, ఆ చుట్టుపక్కల ఉన్నవారిని టెక్నాలజీ సాయంతో వెతికి పట్టుకోబోతున్నట్టు తెలిసింది.
Tags: coronavirus, Tablighi, event, delhi, cell phone, data, gps signals