- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యాదాద్రి పైన ఉన్న ప్రేమ.. రామప్ప పైన ఎందుకు లేదు’
దిశ, రామప్ప: ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ కలిసి మొసలి కన్నీరు కార్చేలా వ్యవహరించాడని, యాదాద్రి అభివృద్ధిపై ఉన్న ప్రేమలో కొంచమైన రామప్ప పై చూపించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో స్పష్టం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్ అన్నారు. శనివారం బీజేపీ నాయకులతో కలిసి రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అనంతరం జవహర్ లాల్ మాట్లాడారు.
ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి యాదాద్రికి రావాలని ఆహ్వానం పలకడం, రాష్ట్రానికి సంబంధించి పది అంశాలపై వినతి పత్రాలు ఇవ్వడం మంచి విషయమే అయినా ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో వచ్చిన గుర్తింపును తమదిగా చెప్పుకునేందుకు పోటీపడిన టీఆర్ఎస్ నేతలకు, ఇక్కడ అభివృద్ధి కోసం కేసీఆర్‌ను నిధులు కేటాయించాలని అడిగే దమ్ము లేదా అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రామప్ప యునెస్కో గుర్తింపును కాపాడుకునేందుకు కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా చుట్టూ ఉన్న ఆలయాలు, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణాకర్, దొంతిరెడ్డి రవి రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి వీరేందర్, సంతోష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.