వారెంటీ ఉండగా కొత్తవి కొనడమేందుకు..?

by  |
వారెంటీ ఉండగా కొత్తవి కొనడమేందుకు..?
X

దిశ, హుస్నాబాద్: వీధి దీపాల వారెంటీ ఉండగా కొత్తవి కొనడం ఎందుకని కొహెడ యూత్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఆవుల మహేందర్ ప్రశ్నించారు. శనివారం కొహెడ మండలం చెంచలచెరువుపల్లి గ్రామసభ రసాభాసాగా సాగింది. సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు భీంరెడ్డి తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎల్లబోయిన రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మహేందర్ మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితం రెండేళ్ల వారెంటీతో రూ. 1.60లక్షలను వెచ్చించి 80 వీధి దీపాలను తీసుకున్నారన్నారు. వాటి వారెంటీ పూర్తి కాకముందే గ్రామ పంచాయతీ నిధులతో మరో 50 కొత్త దీపాలను ఎలా తీసుకొచ్చారని సర్పంచ్, సెక్రెటరీలను ప్రశ్నించారు. సదరు వీధి దీపాల కాంట్రాక్టర్ ఫోన్ లిఫ్టు చేయడం లేదని అందువల్లే కొత్తవి తీసుకచ్చినట్లు అధికారులు చెప్పారన్నారు. ఇప్పటికైనా ఎంపీడీఓ, డీపీఓ, ఉన్నతాధికారుల స్పందించి సదరు కాంట్రాక్టర్‎పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగ పరిస్థితే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని భీంరెడ్డి తిరుపతిరెడ్డి హెచ్చరించారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed