నగ్నంగా స్నానం చేస్తున్నారా? మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..

by Dishafeatures3 |
నగ్నంగా స్నానం చేస్తున్నారా? మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : మనం చేసే రోజువారీ కార్యకలాపాల్లో స్నానం ఆచరించడం కూడా ఒకటి. అయితే ఇది ఎలా చేయాలనేది పురాణాల్లో ప్రస్తావించబడింది. ఎలా చేయకూడదో కూడా వివరించబడింది. నగ్నంగా స్నానం ఆచరిస్తే జరిగే చెడు గురించీ చెప్పబడింది. ఇందుకు సంబంధించిన కొంత సమాచారం తెలుసుకుందాం.

* ఒంటిపై నూలు పోగు లేకుండా స్నానం చేసే అలవాటు చాలా మందికే ఉంటుంది. కానీ ఇలా చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఇవి స్నానం చేసే వ్యక్తిని మాత్రమే కాకుండా ఆ ఇంటి సభ్యులపై శారీరక, మానసిక ప్రభావం చూపుతాయని అంటుంటారు.

* నగ్న స్నానం లక్ష్మీ దేవిని ఆగ్రహానికి గురిచేస్తుందనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేకుండా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయని చెప్తారు. అందుకే కనీసం టవల్, ఇన్నర్ వేసుకుని చేయాలని చెప్తారు.

* ఇక ఇలాంటి స్నానం పితృ దోషాన్ని కలిగిస్తుందని కూడా ఒక నమ్మకం. పూర్వీకులకు కోపం తెప్పిస్తుందని.. వారి శాపాలకు బలి కావాల్సి ఉంటుందని అంటుంటారు.

* ఇక పూర్వకాలం బాత్రూమ్ బయటే ఉండేది. పాములు, పురుగులు వచ్చినప్పుడు బయటకు వెళ్ళాలంటే ఒంటి మీద ఏదో ఒక వస్త్రం ఉండాలని కూడా ఇలా చెప్పేవారని తెలుస్తుంది.



(అయితే పైన చెప్పిన వాటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి నగ్నంగా స్నానం ఆచరించడం వల్ల బోలెడు లాభాలున్నాయని సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది)



Next Story