పాండవుల గుట్టను మింగేస్తున్న డీబీఎల్ కంపెనీ

by Disha Web Desk 23 |
పాండవుల గుట్టను మింగేస్తున్న డీబీఎల్ కంపెనీ
X

దిశ,హుజురాబాద్ : హుజురాబాద్ లోని సిర్శపల్లీ ప్రాంతంలో పాండవుల గుట్టను ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ డీబీఎల్ మింగేస్తుంది. నేషనల్ హైవే ఎన్ హెచ్ 563 కంపెనీ ప్రస్తుతం కరీంనగర్ నుంచి వరంగల్ వరకు నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు ను నిర్మిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఆ కంపెనీ మనకొండూర్,హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి,హనుమకొండ జిల్లా వల్భాపుర్ వద్ద క్యాంపులు ఏర్పాటు చేసుకుని పనులు మొదలు పెట్టారు.ఈ రోడ్డు పనులు కోసం ప్రభుత్వం కోసం హుజురాబాద్ మండలం సిర్శపల్లి రోడ్ ప్రాంతంలో 496 సర్వే నెంబర్ లో మట్టి తీసుకోవడానికి గాని 25 ఎకరాలను ప్రభుత్వ అనుమతి తో లీజుకు తీసుకున్నారు. సైదాపూర్ మండలం బొమ్మకల్ గుట్టల ప్రాంతంలో మరో చోట మట్టి తీయుటకు గాను ఒప్పందం చేసుకుని నిత్యం వందల సంఖ్యలో లారీ లు మట్టిని తోడుకెలుతున్నాయి.

కాగా ఈ మధ్య కాలంలో హుజురాబాద్ లోని పాండవుల గుట్ట పక్కన వీరు మట్టి తీస్తున్న చోట అడుగున బండ రాయి రావడం తో వీరి కన్ను పక్కనే ఉన్న పాండవుల గుట్ట పై పడింది. అప్పటికే అక్కడ మట్టి మాఫియా గుట్టను మాయం చేసే పనిలో పడి రాత్రి వేళల్లో లారీ ల కొద్దీ మట్టిని హుజురాబాద్,వరంగల్,జమ్మికుంట తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు . తాజాగా డీబీల్ కంపెనీ కన్ను దీనిపై పడి టన్నుల కొద్దీ మట్టి నీ పదుల సంఖ్యలో మిషన్లు పెట్టి లారీల కొద్ది మట్టి నీ తీస్తూ రోడ్డు నిర్మాణానికి సరఫరా చేస్తున్నారు. వీరికి ఈ గుట్టపై మట్టి నీ తీయుట కు ఎలాంటి అనుమతులు లేవు. అయినా వీరు నిరాటంకంగా మట్టి తీడుకెలుతున్నారు వీరికి తోడు రాత్రి వేళల్లో మట్టి మాఫియా చెలరేగిపోతున్నారు .దీంతో గుట్ట దాదాపుగా మాయం అయ్యే పరిమితం అయ్యే పరిస్థితి కి చేరుకుంది. ఎవరికైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజ్ కు ఇస్తే తమకు కేటాయించిన బౌండరీ లో నే నడుచుకోవాలి.కానీ ఇక్కడ డీ బీ ఎల్ కంపెనీ వారు పరిధి దాటి గుట్టని కొల్లగొడుతున్నారు.

రెండు లారీలు సీజ్..

డీబీఎల్ కంపెనీ గుట్టకు మట్టి తీస్తున్న విషయం తెలుసుకున్న మైనింగ్ అధికారులు గురువారం వచ్చి నామమాత్రంగా రెండు లారీలను సీజ్ చేసి వెళ్లారు. మట్టి తీస్తున్న ప్రదేశం లో పదుల సంఖ్యలో లారీ లు ఉండగా కేవలం రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి వెళ్లడం అధికారులకు, డీబీఎల్ కంపెనీ కు ఉన్న సంబంధం కు అద్దం పడుతుంది. ఈ విషయం లో సమాచారం అందుకున్న ‘దిశ’ అక్కడికి వెళ్ళే సరికి వందల లారీల్లో మట్టి తీస్తూ కనబడింది.



Next Story

Most Viewed