- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలిసారి విడాకుల పై స్పందించిన మెగా డాటర్.. భర్తకు విడాకులు ఇవ్వలేదని సంచలన పోస్ట్!
దిశ, సినిమా : మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈమెకు సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా శ్రీజకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అది ఏమిటంటే?చిరు చిన్న కూతురుకు సంబంధించిన తన పర్సనల్ లఫ్, పెళ్లి, డివోర్స్‌కు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవతుంటాయి. అయితే శ్రీజ తన తల్లిదండ్రులను కాదు అనుకుని తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తర్వాత మనస్పర్థల కారణంగా అతని నుంచి విడిపోయి, పాపతో పాటు చిరు చెంతకు చేరింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్‌ను ఘనంగా వివాహం చేసుకుంది. వీరికి కూడా పాప జన్మించింది. అయితే కొన్ని రోజులు చాలా సంతోషంగా గడిపిన ఈ జంట, చాలా రోజుల నుంచి విడి విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో వీరు విడాకులు తీసుకున్నారంటూ నెట్టింట ఎన్నో వార్తలొచ్చాయి.
ఇక శ్రీజ విడాకులు తీసుకుందని వార్తలు వచ్చిన ఇన్ని రోజుల తర్వాత ఈ బ్యూటీ తొలిసారి విడాకులపై స్పందించింది. తన ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో.. ఓ అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది, కానీ తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు అంటూ తన భర్త కోరుతున్నాడంటూ.. ది ఆంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్‌కు ప్రశ్న పంపింది. దీనికి వారు ఆన్సర్ ఇస్తూ.. ఆయనతో ఉంటే మీరు సంతోషంగా ఉంటారా లేరా అనే ప్రశ్న మీకు మీరు వేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ స్క్రీన్ షాట్ శ్రీజ తన ఇస్టా స్టోరిలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది . అలాగే డివోర్స్ పై స్పందిస్తూ.. మీకు మీరే ఆలోచించుకోండి, బబుల్ బాత్ చేయడం, స్పా కి వెళ్లడం, మంచి డ్రెస్ లు కొనుక్కోవడం, అందంగా తయారవడం అనేది సెల్ఫ్ లవ్ అని చెప్పుకొచ్చింది. సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్.. మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకు ఉందా అంటూ శ్రీజ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీరు ఇంకా విడాకులు తీసుకోలేదు, కానీ కళ్యాణ్ దేవ్ తో సంతోషంగా ఉండలేకనే ఆమె అతనికి దూరంగా ఉంటోందని చెప్పుకొస్తున్నారు మెగా అభిమానులు. అంతే కాకుండా తాను హ్యాప్పీగా లేని కారణంగానే కళ్యాణ్‌కు దూరంగా ఉంది తప్ప డివోర్స్ ఇవ్వలేదు.. ఆ విషయాన్ని తాను పోస్ట్ ద్వారా ఇన్ డైరెక్ట్‌గా చెప్పుకచ్చిందంటున్నారు తమ అభిమానులు.