BREAKING: ఎన్నికల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోడీ సంచలన పిలుపు

by Disha Web Desk 19 |
BREAKING: ఎన్నికల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోడీ సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. థర్డ్ ఫేజ్‌లో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దీంతో తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. థర్డ్ ఫేజ్‌లో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ పోలింగ్ జరుతుగుతోంది. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోడీ, అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుజరాత్ వెళ్లారు.

అహ్మదాబాద్‌లోని నిషాన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోడీతో పాటు పోలీంగ్ కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని, దేశ ప్రజలంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధిక ఓటింగ్‌తో రికార్డ్ సృష్టించాలన్నారు. ఎండల్లో కూడా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, ఎన్నికల వేళ తమ ప్రజలు తమ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.

ఎన్నికల వేళ సమయంతో పోటీ పడుతూ మీడియో పని చేస్తోందని ప్రధాని మోడీ ప్రశంసించారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ జరుగుతోందని.. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎలక్షన్ కమిషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక, ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌కు రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పెద్ద ఎత్తున పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్‌ను రంగంలోకి దించారు. ఇక, ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడవ దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

Next Story