MP ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగేది ఇదే.. KCR సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-07 03:15:25.0  )
MP ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగేది ఇదే.. KCR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. సర్కారుపై జనంలో తిరుగుబాటు, ఏహ్యభావం స్టార్ట్ అయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే అన్నారు. సీఎం అతి ప్రవర్తన, జుగుప్సాకరమైన భాష వారికే శాపం అని స్పష్టం చేశారు. ఎంపీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ 12 పై చిలుకు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జలాల మళ్లింపు ప్రధాని మోడీ దుస్సాహసం అన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి కూడా పైసా పనిచేయలేదన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ విధ్యంసమైందని విమర్శించారు. ఐదు నెలల్లో కాంగ్రెస్ వికృత రూపం చూస్తున్నామని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో మళ్లీ బీజేపీ వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సాయం చేస్తోందని.. కేసీఆర్‌ను ఓడించేందుకు ఇద్దరూ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలయ్యాక రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తప్పదన్నారు. అప్పుడు బీఆర్ఎస్ సందర్భోచిత నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మోడీ వికృత రూపానికి ప్రతిరూపమే ఢిల్లీ లిక్కర్ కేసు అని సీరియస్ అయ్యారు. తెలంగాణకు కాంగ్రెస్‌ను మించిన ప్రబల శత్రువు ఇంకెవరు ఉండరన్నారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్, మంత్రులకు పరిజ్ఞానం లేదని కేసీఆర్ మండిపడ్డారు. రెండు పిల్లర్లు దెబ్బతింటే ప్రాజెక్టు నిరుపయోగమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో తమకు సంబంధం లేదని గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed