- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హరీష్ రావు రాజీనామా లేఖ చెల్లదా..? అసలు విషయం బయటపెట్టిన మంత్రి కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ఆగస్ట్ 15లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి హరీష్ రావు రిజైన్ లైటర్ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హరీష్ రావు రాజీనామా లేఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు రిజైన్ లెటర్‌ను ఒకటిన్నర పేజీ రాశారు.. కానీ రాజీనామా లేఖ ఒకటిన్నర లైనుకు మించితే స్పీకర్ ఫార్మాట్‌లో ఆమోదం పొందదని స్పష్టం చేశారు. హరీష్ రావు రాజీనామా లేఖ చూస్తుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. సీఎంకు సవాల్ విసిరానని హరీష్ రావు గొప్పగా చెప్పుకుంటున్నారు.. కానీ బీఆర్ఎస్‌లో ఆయన ఒక ఉద్యోగి మాత్రమేనని అన్నారు.
హరీష్ రావు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు బయపడుతున్నాడని.. కానీ తాను తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశానని గుర్తు చేశారు. ఆగస్ట్ 15న రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుండి బయటకు రాలేదని.. పవర్ పోగానే కర్ర పట్టుకుని బయటకు వస్తున్నారని సెటైర్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి 3 నెలల్లో 60 సార్లు సచివాలయానికి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో కనీసం హోంమంత్రికి కూడా అపాయిట్మెంట్ దొరకలేదని ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు నాటకాలాడుతున్నారని ఫైర్ అయ్యారు.