కల్నల్ సంతోష్‌కు టీ-ఎన్జీవో నివాళి

by Shyam |
కల్నల్ సంతోష్‌కు టీ-ఎన్జీవో నివాళి
X

దిశ, హైదరాబాద్: దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని ఎన్జీవో కార్యాలయంలో సంతోష్ బాబు చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. చైనా సైనికులు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టిందన్నారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మాన్, బాలరాజు, కురాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story