తృణమూల్ గూండాలకు అదే గతి: యోగి ఆదిత్యానాథ్

by Shamantha N |
UP CM Yogi Adityanath
X

కోల్‌కతా: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టీఎంసీ పార్టీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. తృణమూల్ గూండాలకు యూపీలోని గూండాలకు పట్టిన గతే పడుతుందని అన్నారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే ఇది జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఈ గూండాలు మోకాళ్లపై కూర్చుంటారని హెచ్చరించారు. యోగి ఆదిత్యానాథ్ జంగిపారాలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు. దీదీ తప్పుడు కూతలు కూస్తే రాష్ట్ర యువత తగిన సమాధానమిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌లోనూ కశ్మీర్ తరహా ఆటంకాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పుడు కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరగడం లేదని, అభివృద్ధి మాత్రమే జరుగుతున్నదని చెప్పారు.

Advertisement

Next Story